![]() |
![]() |
.webp)
సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ సీజన్ 4 ప్రోమో రీసెంట్ కొత్తది వచ్చేసింది. ఇందులో ఉప్మా ఛాలెంజ్ మాములుగా లేదు భయ్యో. ఇందులో రాశి-రోజా మధ్య "ఉప్మా మేకింగ్ ఛాలెంజ్" పెట్టారు. ఇక రాశి ఉప్మా చేస్తోంది. శ్రీకాంత్ ఆమెకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఏదో సాయం చేద్దామనుకొని శ్రీకాంత్ కప్పుతో రవ్వ వేయబోతుండగా హోస్ట్ రవి మధ్యలో వచ్చి అయ్యయ్యో కప్పుతో కాదు చేత్తో వేయాలి అన్నాడు. దీంతో అవాక్కయిన రాశి "చాలు చాలు" అంటూ వేసే రవ్వను కూడా ఆపించేసారు. ఇక ఇంకో వైపు ఉప్మా ఛాలెంజ్ కోసం పోటీ పడుతున్న రోజా దగ్గరికెళ్లి గిన్నెలో ఉన్న ఉప్మా రవ్వను చూపించి వేసేయ్యనా అని అడిగాడు.
వేసేయండి అంది రోజా. తర్వాత నాకు సంబంధం లేదంటూ మొత్తం రవ్వ బాండీలో వేసేశాడు శ్రీకాంత్. ఇక రాశి గారు చేసిన ఉప్మా రెడీ అని రవి చెప్పేసరికి టేస్ట్ చేద్దామని శ్రీకాంత్ గరిటెతో నోట్లో వేసుకున్నాడో లేదో నోరు కాలిపోయింది. దీంతో రోజా కూలిపోయింది "బాగా కాలింది..బాగా కాళింది" అంటూ నడుము ఊపుతూ డాన్స్ చేసింది. తర్వాత రోజా చేసిన ఉప్మా కూడా రుచి చూసి ఇద్దరు చేసిన ఉప్మాలు బాగున్నాయని చెప్పాడు. ఇక రోజా తానూ చేసిన ఉప్మా అందరికీ పంచగా చాలా మిగిలిపోయింది. "రోజా గారి ఉప్మా ఇంత మిగిలిపోయింది" అంటూ రవి చూపించాడు. "మా దగ్గరేమో మొత్తం రవ్వ వేసేసారు" అని శ్రీకాంత్ మీదకు తప్పు నెట్టేద్దామని చూసింది రోజా. ఇక శ్రీకాంత్ "నీళ్లు పోసాక కదా రవ్వ వేయాలి అంటే లేదు లేదు మా ఊళ్లో ఇట్లాగే వేస్తారు" అంటూ ఫన్నీ ఎక్స్ప్రెషన్ తో రోజాకు కౌంటర్ ఇచ్చాడు. ఇక ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ మొదటి ఎపిసోడ్‌కి డైెరెక్టర్ అనిల్ రావిపూడి, బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్ కూడా రానున్నారు. ఇక ఈ షోలో భాగ్యవతి, గుండమ్మ కథ, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, పడమటి సంధ్యారాగం, చామంతి, ప్రేమ ఎంత మధురం, మేఘ సందేశం, అమ్మాయి గారు, ఎన్నోళ్లో వేచిన హృదయం, జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం, ముక్కు పుడక, సీతే రాముడి కట్నం, ఉమ్మడి కుటుంబం వంటి 16 సీరియల్స్ వాళ్ళు పోటీ పడుతున్నారు.
![]() |
![]() |